ద్రౌప‌ది ముర్మును ఆకాశానికి ఎత్తేసిన వర్మ

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏంచేస్తాడో ఎవరికీ తెలియదు..అంతెందుకు ఆయనకు కూడా తెలియదు. ఎవర్ని పొగుడుతాడో..ఎవర్ని తిడతాడో ..అసలు ఎప్పుడు ఏంచేస్తాడో తెలియదు. అందుకే ఆయన చేసిన , ఏ ట్వీట్ చేసిన అది వైరల్ అవుతుంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే వర్మ..నిత్యం వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ అందరి చేత చివాట్లు తిట్టించుకుంటాడు. తాజాగా NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌప‌ది ముర్ము విషయంలోను అలాగే చేసాడు. NDA అధికారికంగా ద్రౌప‌ది ముర్ము పేరును ప్రకటించిన తర్వాత..వర్మ తన ట్విట్టర్ లో ద్రౌపదీ ముర్ము ప్రెసిడెంట్ ఐతే పాండవులు ఎవరు..? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు ? అంటూ తన ట్విట్టర్ ఖాతాలో కాంట్రవర్సీ కామెంట్ ని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ కావడం తో బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రపతి అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు అబిడ్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

దీంతో వర్మ మరో ట్వీట్ చేశారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పుకొచ్చారు. మహాభారతంలో ద్రౌపది పాత్ర తనకు నచ్చుతుందని, ద్రౌపది పేరు చాలా అరుదుగా ఉంటుందని ట్వీట్ లో తెలిపారు. ఆ పేరు వినగానే తనకు ఇతర పాత్రలు గుర్తుకొచ్చాయని వెల్లడించారు. ఎవరి సెంటిమెంట్ లను గాయపరిచాలనే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ద్రౌపదీ ముర్ము ను ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తూ మరో ట్వీట్ చేసాడు.

అత్యంత గౌరవనీయమైన ద్రౌపది గారు ప్రెసిడెంట్‌గా ఉంటే.. పాండవులు, కౌరవులు ఇద్దరూ తమ యుద్ధాన్ని మరచిపోయి.. కలిసి ఆమెను ఆరాధిస్తారని, ఈ క్రమంలోనే కొత్త భారతదేశంలో మహాభారతం తిరిగి రాయబడుతుందని చెప్పుకొచ్చారు. ఇండియాను చూసి ప్రపంచం గర్విస్తుందన్న ఆయన జై బీజేపీ..’ అంటూ ఆసక్తికర రీతిలో ట్వీట్ చేశారు. ద్రౌపది జీ ప్రపంచం మొత్తంలో ఎప్పటికీ గొప్ప రాష్ట్రపతి అవుతారనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని అంటూనే బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.