బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ 2 కలెక్షన్ల జోరు తగ్గింది

బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ 2 కలెక్షన్ల జోరు తగ్గింది. హిట్ చిత్రానికి సీక్వెల్ గా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్ 2 మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విశ్వక్ సేన్ హీరోగా , శైలేష్ కొల‌ను డైరక్షన్ లో 2020 లో క్రైం ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ రిలీజ్ టైమ్ లోనే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘హిట్ 2’ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సీక్వెల్ లో కూడా విశ్వక్ సేన్ హీరోగా ఉంటారని అనుకున్నారు కానీ విశ్వక్ బదులుగా అడివి శేష్ ను తీసుకున్నారు.

వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నేచురల్ స్టార్ నాని సమర్పణలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌ లో మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటించింది. మొదటి రోజు మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. మొదటి మూడు రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద హావ చూపించిన హిట్ 2 ..నాల్గో రోజు నుండి వసూళ్లు బాగా తగ్గాయి. ఇక ఐదో రోజు వసూళ్లు చూస్తే..నైజాంలో రూ. 31 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 62 లక్షలు షేర్, రూ. 1.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఫలితంగా ఐదు రోజుల్లో నైజాంలో రూ. 5.87 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.60 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 78 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 52 లక్షలు, గుంటూరులో రూ. 78 లక్షలు, కృష్ణాలో రూ. 72 లక్షలు, నెల్లూరులో రూ. 46 లక్షలతో.. ఆంధ్రా, తెలంగాణలో రూ. 12.03 కోట్లు షేర్, రూ. 19.80 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.25 కోట్లు మేర బిజినెస్ జరుగగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 17.28 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ 2.28 కోట్లు లాభాలు దక్కాయి.