‘విరూపాక్ష’ నుండి నచ్చావులే నచ్చావులే సాంగ్ రిలీజ్

సాయి ధరమ్ తేజ్ – సంయుక్త జంటగా కార్తీక వర్మ దండు డైరెక్షన్లో సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం విరూపాక్ష . ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘నచ్చావులే నచ్చావులే’ శుక్రవారం సాయంత్రం విడుదలైంది. ఇప్పటికే విడుదలైన విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ వీడియో, టీజర్‌కు మంచి స్పందన రాగా..ఈరోజు విడుదలైన సాంగ్ కూడా మంచి ఆదరణ లభిస్తుంది. కార్తీక్ ఈ సాంగ్ ను ఆలపించగా, కృష్ణ కాంత్ సాహిత్యం అందించారు.

కాంతార ఫేం అంజనీశ్‌ లోక్‌నాథ్‌ విరూపాక్ష చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విరూపాక్షలో బ్రహ్మాజీ, అజ‌య్‌, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయిధరమ్‌ తేజ్ మరోవైపు సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్‌ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ ఓ కీలక రోల్ చేస్తుండడం విశేషం. జులై 28 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

YouTube video