ఆసుత్రిలో చేరిన డొనాల్ట్‌ ట్రంప్‌

వాల్టర్ రీడ్ ఆసుపత్రిలో ట్రంప్‌కు చికిత్స

trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ దంపతులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా నిన్న ప్రకటించారు. కొన్ని గంటల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్న ట్రంప్‌ ఆసుపత్రిలో చేరారు. అంతకు ముందు ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తమ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. ‘ఇంతగా మద్దతు ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నేను వాల్టర్ రీడ్ ఆసుపత్రికి వెళుతున్నాను. నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని నేను అనుకుంటున్నాను’ అని ట్రంప్ తెలిపారు. ఈమేరకు ఆయన 18 క్షణాల పాటు ఉన్న ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. తన భార్య మెలానియా ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉందని ట్రంప్ తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ట్రంప్‌ కొన్ని రోజుల పాటు వాల్టర్ రీడ్ మిలిటరీ ఆసుపత్రి నుంచే పనిచేస్తారని వైట్‌హౌస్‌ తెలిపింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/