కవిత అరెస్ట్ పై స్పందించిన విజయశాంతి

Vijayashanti reacts on Kavitha’s arrest

హైదరాబాద్‌ః ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. కవిత అరెస్ట్ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు, సీనియర్ సినీ నటి విజయశాంతి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్లప్పుడు కాలం కర్మను నిర్ణయిస్తుందని… ఆ కర్మ ఎప్పుడైనా ఒకప్పుడు ఆచరణను నడిపిస్తుందని విజయశాంతి అన్నారు. నిజనిర్ధారణ పరిణామాలు న్యాయ వ్యవస్థ తీర్పులపై ఆధారపడే అంశాలే అయినప్పటికీ… తెలంగాణ ఉద్యమ సమాజం కొట్లాడి తెచ్చుకున్న మన రాష్ట్రానికి ఏర్పడ్డ తొలి ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు అవినీతి కేసులకు దూరంగా ఉన్నట్టయితే ఎంతో మంచిగుండేదని అన్నారు. మరోవైపు కవిత ప్రస్తుతం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఉన్నారు. ఆమెను కోర్టులో ప్రవేశ పెట్టారు.