కవితకు మద్దతు తెలిపిన అఖిలేశ్ యాదవ్

akhilesh-yadav-tweet-on-mlc-kavitha-arrest

లక్నోః బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ సిఎం కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అరెస్టును యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఖండించారు. బిజెపికి ఓటమి భయం పట్టుకుందని ట్విట్టర్ వేదికగా ఆయన ఆరోపించారు. అందుకే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసిందని మండిపడ్డారు. అయితే, ప్రతిపక్ష నేతలపై ఎంతగా దాడులు చేస్తుంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అంతే పెద్ద మొత్తంలో సీట్లను కోల్పోతుందని చెప్పారు.

ప్రతిపక్షాలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్న బిజెపికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారని అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా ట్వీట్ చేస్తూ యూపీ మాజీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్టు అక్రమమని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు అఖిలేశ్ యాదవ్ తన ట్వీట్ ను బిఆర్ఎస్ పార్టీ, కవిత, కవిత ఆఫీస్ అకౌంట్లకు ట్యాగ్ చేశారు.