రేపు ఢిల్లీకి వెళ్లనున్న సిఎం జగన్‌

అమరావతి: ఏపి సిఎం జగన్‌ మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సిఎం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటి కానున్నారు. ఏపిలో నెలకొన్న తాజా పరిణామాలతో పాటు పలు అంశాలపైనా హోమంత్రితో జగన్ చర్చించనున్నారు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులతోనూ జగన్ సమావేశమవుతారని తెలుస్తోంది.


ఏపిలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై హోంమంత్రి అమిత్ షాకు జగన్ వివరించనున్నట్లు తెలుస్తోంది. విగ్రహాల ధ్వంసం వెనక రాజకీయ కుట్ర ఉందని నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/