కాంగ్రెస్ లో చేరడం ఫై విజయశాంతి క్లారిటీ

బిజెపి నేత , సినీ నటి విజయశాంతి బిజెపి పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరగడం తో ఈ వార్తలు చూసి అంత నిజమే కావొచ్చని భావిస్తున్నారు. ఈ తరుణంలో విజయశాంతి ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

తాను కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. బీజేపీని తాను వదలడం లేదని, అదంతా తప్పుడు ప్రచారం అని స్పష్టత ఇచ్చారు. విజయశాంతి నిన్న (నవంబరు 11) పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. తాను బీజేపీని ఎందుకు వీడుతానని అన్నారు. మొత్తానికి విజయశాంతి పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై స్వయంగా ఆమెనే క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు చెక్ పడింది.