తెలంగాణ గవర్నర్‌ వ్యక్తిగత సిబ్బంది రాజు మృతి

telangana governor personal staff raju dies
telangana governor personal staff raju dies

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ వ్యక్తిగత సిబ్బంది రాజు గుండెపోటుతో మరణించారు. ఈయన వయసు 47 ఏళ్లు. గురువారం సికింద్రాబాద్ స్కందగిరి దేవాలయాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై వెంట ఉండే అటెండర్ రాజ్ కుమార్ ఒక్కసారిగా కుప్పకూలి పోవడం తో అంత షాక్ అయ్యారు.

ఏమైంది..ఏమైంది..అంటూనే వెంటనే ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ హాస్పటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు రాజు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చనిపోయినట్టు ధ్రువీకరించడం తో మృతదేహాన్ని రాజ్ భవన్ కు తరలించారు. మృతుడికి ఇద్దరు పిల్లలు. రాజు మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.