టోల్ ఛార్జ్ బాదుడు ఫై వాహనదారులు గగ్గోలు

ఈరోజు (ఏప్రిల్ 01) నుండి టోల్ చార్జీలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ చార్జీల మోత ఫై వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. వాహనం స్థాయిని బట్టి 5 నుంచి 49 రూపాయల వరకు పెరిగింది టోల్ ఛార్జ్‌. నెలవారీ పాస్‌లపై 275 నుంచి 330 రూపాయల వరకు పెరిగాయి. జిల్లాల మీదుగా రాకపోకలు సాగించే వారికి సైతం టోల్ బాదుడు తప్పడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్ని కలిపే ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైదరాబాద్‌-విజయవాడ 65వ నంబర్‌ జాతీయ రహదారి, హైదరాబాద్‌-వరంగల్‌ 163వ నంబర్ జాతీయ రహదారి చాలా కీలకం. ఈ రెండు హైవేల మీద వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

గూడ్స్ వాహనాలపై కూడా బాదుడు షురూ కావడంతో లారీలు నడపలేని పరిస్థితిలో ఉన్నామంటున్నారు ఓనర్లు. అటు… పెరిగిన టోల్ భారాన్ని సీరియస్‌గా తీసుకుని ఆర్టీసీ ప్రయాణీకుడ్ని కూడా టార్గెట్ చేశాయి ప్రభుత్వాలు. టోల్ సేస్ పేరుతో భారీగా టికెట్ చార్జీలు వసూలు చేస్తోంది టీఎస్ ఆర్టీసి. APSRTC కూడా ప్రయాణికుల ఫై భారం మోపేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ టోల్ ఛార్జ్ బాదుడు ప్రతి ఒక్కరి ఫై పడుతుంది. కూరగాయలు , నిత్యావసరాలు ఇలా అన్నింటిపై భారం పడబోతోంది. ఇప్పటికే అంన్నింటికీ ధరలు పెంచిన కేంద్రం..ఇప్పుడు టోల్ చార్జీలను సైతం పెంచడం ఫై ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.