బండి సంజయ్ మార్పు బాధాకరం అంటూ రాములమ్మ ట్వీట్

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించడంఫై ఆయన అభిమానులతో పాటు పలువురు పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బిజెపికి ఊపిరి పోసింది బండి సంజయ్ అని..అలాంటి సంజయ్ ని తొలగించడం ఫై సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే…మరికొంతమంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా సీనియర్ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ ని తొలగించడం ఫై ట్వీట్ చేసారు. నిప్పులు పుట్టించే నడకను పార్టీకి రాష్ట్రంలో నేర్పిన బండి సంజయ్‌ను మార్చడం బాధాకరమని, ఆయనకు త్వరలో మరింత మంచి బాధ్యతను ఢిల్లీ అధిష్టానం అప్పగిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే తమ కార్యకర్తల మనోభావాలను బీజేపీ అగ్రనాయకత్వం గుర్తిస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. రీసెంట్ గా తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా ఈటల రాజేందర్‌ ను అధిష్టానం నియమించింది.