‘బ్రో’ టైటిల్ సాంగ్ రాబోతుంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ బ్రో. జులై 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ చిత్ర ప్రమోషన్ ను స్పీడ్ చేసారు. రీసెంట్ గా రిలీజ్ అయినా టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు సినిమా ఫై అంచనాలు పెంచేసింది. ఇక ఇప్పుడు సినిమాలోని టైటిల్ సాంగ్ ను ఈ శనివారం రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చి వాటి సక్సెస్ లో కీలకంగా మారిన ..థమన్ మరోసారి మ్యూజిక్ అందించడం తో ఈ చిత్రంలోని సాంగ్స్ ఫై మరింత ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం లో మొత్తం 5 పాటలు ఉంటాయని టాక్. రీసెంట్ గానే జర్మనీ లో సాయి ధరమ్ తేజ్ మీద ఒక సాంగ్ ని చిత్రీకరించారు. ముఖ్యంగా ఈ సినిమాలో పార్టీ సాంగ్ కుమ్మేసిందని అంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.