కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆదిపురుష్ నటుడు

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం తో ఇప్పుడు దేశ వ్యాప్తంగా మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని నమ్ముతున్నారు. ఇదే నమ్మకంతో ఆ పార్టీ లో చేరుతున్నారు. తాజాగా ఆదిపురుష్ నటుడు విక్రమ్ మస్తాల్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

తాజాగా ఈయన ఆదిపురుష్ మూవీ లో హనుమాన్ పాత్రలో నటించాడు. ఈయన పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విక్రమ్ స్వస్థలం మధ్యప్రదేశ్. విక్రమ్ మస్తాల్.. మధ్యప్రదేశ్ బాడీ బిల్డర్‌గా పేరుగాంచాడు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు విక్రమ్ మొగ్గు చూపారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, మధ్యప్రదేశ్ ప్రస్తుత పీసీసీ చీఫ్ కమల్‌నాథ్ సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి.. ఆ పార్టీలో చేరినట్లు విక్రమ్ మస్తాల్ వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చేసిన అభివృద్ధి పనులు తనను రాజకీయాల్లోకి రావడానికి ప్రోత్సాహం అని విక్రమ్ పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీయే అని బలంగా విశ్వసించి.. ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు.