పచ్చ పార్టీకి కాపలా కాయడం ఆమెకు మాత్రమే సాధ్యంః విజయసాయిరెడ్డి

పురందేశ్వరిపై మరోసారి విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి

vijayasai-reddy-tweets-on-purandeswari

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత లోక్ సభ ఎన్నికల్లో పురందేశ్వరి విశాఖ స్థానం నుంచి పోటీ చేశారని, కానీ 20 పోలింగ్ బూత్ లలో ఆమెకు ఒక్క ఓటు కూడా పడలేదని వెల్లడించారు. మరో 40 పోలింగ్ బూత్ లలో 10 కంటే తక్కువ ఓట్లే పడ్డాయని వివరించారు. అయినా ఆమె రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు అయ్యారని, అందరికీ అలా కలిసి వస్తుందా ఏంటి? అంటూ విజయసాయి ఎద్దేవా చేశారు. కాషాయ పార్టీకి నాయకత్వం వహిస్తూ పచ్చ పార్టీకి కాపలా కాయడం ఆమెకు మాత్రమే సాధ్యమని చురక అంటించారు.