రాష్ట్ర ఏర్పాటు తర్వాత అసెంబ్లీ సమావేశాలు విధానపరంగా జరుగుతున్నాయిః విజయశాంతి

సచివాలయం కూడా పూర్తిస్థాయిలో పనిచేస్తోందని ప్రశంస

congress-leader-vijayashanthi-praises-telangana-assembly-sessions

హైదరాబాద్‌ః అసెంబ్లీ సమావేశాలు విధానపరంగా జరగడం రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇదే తొలిసారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. 2014 తర్వాత సమావేశాలు ఇంత సాఫీగా, హుందాగా జరుగుతుండగా చూశానని పేర్కొన్నారు. సచివాలయం కూడా ఇప్పుడు పూర్థిస్థాయిలో పనిచేస్తోందని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దాదాపు దశాబ్దం తర్వాత ప్రజాస్వామ్య పంథాలో ప్రభుత్వం నడుస్తున్నదని పేర్కొన్నారు.

ఇది ప్రజా ప్రభుత్వమని, అది ప్రజాస్వామ్య పంథాలో నడుస్తున్నదని కోట్లాదిమంది ప్రజలకు ఇప్పుడిప్పుడే విశ్వాసం ఏర్పడుతోందని తెలిపారు. 26 సంవత్సరాల పోరాటం తర్వాత మీ రాములమ్మ ఇప్పుడు ఏం చేయాలని ఎవరైనా తనను అడిగితే.. తెలంగాణ ప్రజలకు కాలం మేలు చేయాలని, ఈ భూమి బిడ్డల భవిష్యత్తు ఎప్పటికీ మంచిగా ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటానని చెబుతూ విజయశాంతి ఎక్స్ ద్వారా తెలిపారు.