పురంధేశ్వరిది నిలకడలేని రాజకీయం – విజయసాయిరెడ్డి

బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిప్పులు చెరిగారు.పురంధేశ్వరిది నిలకడలేని రాజకీయం అంటూ కామెంట్స్ చేసారు. పురంధేశ్వరి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ లో మంత్రిగా పని చేశారు. సోనియాగాంధీని అద్భుతంగా పొగిడింది. స్వార్థ్య ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. పురంధేశ్వరికి తెలిసింది.. ఆమె కుటుంబం గురించి.. సామాజిక వర్గం గురించి. రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి తెలియదు అన్నారు.

పురంధేశ్వరి ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు మీ దగ్గర ఆధారాలను వెరిఫై చేసుకొని చెపాలని సూచించారు. పురంధేశ్వరి కుమారుడు జితేష్ గీతమ్ యూనివర్సిటీ ద్వారా వీరు ఏదో కొన్ని విషయాలు ఎవరో వ్యక్తి.. చెబితే లిక్కర్ సిండికేట్ మాపై ఆరోపణలు చేయడం అర్థ రహిత ఆరోపణలు అన్నారు.

అలాగే చంద్రబాబు తన స్వార్థం కోసమే పరిపాలన చేశారని, ఆయన హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబుకు తెలిసింది మోసం, దగా మాత్రమేనని ధ్వజమెత్తారు. బాబు వల్ల అభివృద్ధి చెందింది ఆయన వర్గీయులేనని దుయ్యబట్టారు. అందుకే బాబు పట్ల ప్రజలు సానూభూతి చూపడం లేదని, జాతీయ నాయకులు కూడా సపోర్టు చేయడం లేదని విమర్శించారు.