పవన్‌ కళ్యాణ్‌ నిమిత్త మాత్రుడు

ఆయనను నడిపించేది, వెనక నుంచి నెట్టేది 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడే

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మరియు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా విమర్శలకు దిగారు. పవన్‌ కళ్యాణ్‌ (యాక్టర్‌) నిమిత్త మాత్రుడని నడిపించేది, వెనక నుంచి నెట్టేది, డైరెక్ట్‌ చేసేది, స్క్రిప్ట్‌ చేతి కందించేది, పేమెంట్‌ ఇచ్చేది యాజమాని స్థానంలో ఉన్న 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడే అని విజయసాయిరెడ్డి అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ కమ్యూనిస్టులతో కలిసినా, బిఎస్పీ కాళ్లు పట్టుకున్నా, కమలం వైపు కదిలినా ఆదేశించేది చంద్రబాబే అని అన్నారు. ఇంకా మరోట్వీట్‌లో పవన్‌ కళ్యాణ్‌ను గుండు సున్నాతో పొల్చారు. గుండు సున్నా దేనితోనైనా కలిసినా, విడిపోయినా ఫలితం జీరోనే. సున్నాను తలపైన ఎత్తుకున్నా, చంకలో పెట్టుకున్నా జరగేదదే అన్నారు. ఇది పదేపదే నిరూపితమవుతూనే ఉంటుంది. అయినా ప్రయోగాలకు సాహసించే వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. దెబ్బతింటుంటారు. మనం పాపం అనుకుంటూ వదిలేయాలని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/