సీబిఐ కోర్టులో నేడు జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
హాజరైన పలువురు రాజకీయ ప్రముఖులు

హైదరాబాద్: నగరంలోని నాంపల్లిలో గల సీబిఐ, ఈడీ కోర్టులో ఏపి ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధానంగా ఉన్నంటువంటి రాజకీయ ప్రముఖులు విజయసాయిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు ఈ రోజు ఉదయం కోర్టుకు హాజరయ్యారు. సీబిఐ కోర్టుకు గత శుక్రవారం సిఎం జగన్ హాజరైన విషయం తెలిసిందే. ఆ విచారణ జనవరి 17 కి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లన్నీ ఒకేసారి విచారించాలని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. సీబిఐ తరపున సురేందర్ రెడ్డి వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/