‘బావ’సారూప్యం అంటే ఇదేనేమోః విజయసాయిరెడ్డి

పురందేశ్వరి సలహా మేరకు టిడిపి నేతలను పరామర్శించారన్న విజయసాయి

vijayasaireddy

అమరావతిః ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి, కొందరు బిజెపి నేతలపై వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు బిజెపిలోకి పంపిన కోవర్టులంతా ఆ పార్టీని గాలికొదిలేసి టిడిపి భజన చేస్తున్నారని విమర్శించారు. క్రిమినల్ కేసుల్లో అరెస్టయి కడప జైల్లో ఉన్న టిడిపి జిల్లా నాయకులను పురందేశ్వరి సలహా మేరకు రాష్ట్ర బిజెపి నేతలు పరామర్శించి, సానుభూతిని ఒలకబోయడం ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లిందని అన్నారు. ‘బావ’సారూప్యం అంటే ఇదేనేమో అని ఎద్దేవా చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు.