చెల్లెమ్మా పురందేశ్వరీ… భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా? విజయసాయిరెడ్డి

మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనేంటి అంటూ పురందేశ్వరిపై ఫైర్

vijayasai-reddy-comments-on-purandeswari-again

అమరావతిః ఏపీ బిజెపి చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై తన విమర్శల దాడిని కొనసాగిస్తుండగా, వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఆమెను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీకి కేంద్రం ఎన్నో నిధులు ఇస్తున్నప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధి జరగడంలేదని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఆశించిన స్థాయిలో పనులు జరగడంలేదని విమర్శించారు.

తాజాగా వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి పురందేశ్వరిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో స్పందించారు. చెల్లెమ్మా పురందేశ్వరీ… జిల్లాకు మీ నాన్న పేరు పెట్టిన జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకుని, మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనిని ఏమంటారో దయచేసి చెప్పగలరా? అంటూ