సింగిల్ గా వస్తారో, వేరే పార్టీలతో మింగిల్ అయి వస్తారో మీ ఇష్టం – విజయసాయి రెడ్డి

ఏపీలో పొత్తుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఎలాగైనా జగన్ ను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతుండడం తో వైసీపీ నేతలు విమర్శల దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి ప్రతిపక్షాల ఫై పలు కామెంట్స్ చేసారు. సింగిల్ గా వస్తారో, వేరే పార్టీలతో మింగిల్ అయి వస్తారో మీ ఇష్టం అంటూ కామెంట్స్ చేసారు.

వైసీపీ మాత్రం సింగిల్ గానే ప్రజలతో మింగిల్ అవుతుందని పేర్కొన్నారు. “జాతి పార్టీలతో జతకడతారో, జాతీయ పార్టీలతో కలుస్తారో అది మీ ఇష్టం. మా అధినేత మాత్రం ఎప్పటికీ జనంతోనే మమేకమవుతారు” అని అన్నారు. ‘‘2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయల నుండి వైదొలగక తప్పదు. చంద్రబాబుకి ప్రజల్లో విశ్వసనీయత లేదు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవడని చంద్రబాబుకి తెలుసు.. అందుకే పొత్తులకోసం పాకులాడుతున్నారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.