ప్రభాస్ హీరోయిన్లను చెడగొడుతున్నాడంటూ దిశా పటాని పోస్ట్

ప్రభాస్ సినిమాలో నటించే నటీనటులు ఇప్పటికి ప్రభాస్ ను మరచిపోరు. ఎందుకంటే ప్రభాస్‌ చేసే అతిధి మర్యాదలు ఆ రేంజ్‌లో ఉంటాయి. సెట్‌లో ప్రభాస్‌ ఉన్నారంటే ఇక యూనిట్‌ సభ్యులందరికీ పండుగే. వెరైటీ వంట‌కాల రుచి చూపిస్తారాయన. స్వయంగా ఇంటి నుండి భోజనం తెప్పించి వారికీ కడుపు నిండా భోజనం పెట్టి వామ్మో మీము ఇక తినలేం..అనే విధంగా చేస్తుంటాడు. ఇప్పటికే పలువురు నటీమణులు ప్రభాస్ భోజనం ఫై కామెంట్స్ చేయగా..తాజాగా లోఫర్ బ్యూటీ దిశా పటాని ప్రభాస్ హీరోయిన్లను చెడగొడుతున్నాడంటూ పోస్ట్ చేసి వార్తల్లో నిలిచింది.

దిశా పటాని ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ఇలా స్టార్ క్యాస్టింగ్‌తో నాగ్ అశ్విన్ చేస్తోన్న ప్రాజెక్ట్ కే అప్డేట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా సెట్‌లొ ఇప్పుడు దిశా పటాని ఎంట్రీ ఇచ్చింది. ఇక దిశా పటాని తనకు ప్రభాస్ పంపించిన లంచ్ ఐటంలను చూసి ఆశ్చర్య పోయింది. ఇలా ఫుడ్ పెట్టి మమ్మల్ని చెడగొడుతున్నందుకు థ్యాంక్స్ అని కామెంట్ పెట్టేసింది. అసలే ఎంతో డైట్ మెయింటైన్ చేసి జీరో సైజులోకి వస్తుంటారు హీరోయిన్లు. అలాంటి హీరోయిన్లకు ఇలా ఫుడ్ పెడితే పరిస్థితి అంతే. అందుకే అలా తమను స్పాయిల్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అని దిశా సెటైర్ వేసింది.