బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కీలక తీర్పు

అద్వానీ సహా నిందితులందరూ నిర్దోషులే

Babri-Masjid-Demolition-verdict

లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కీలక తీర్పు వెలువడింది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్ కే యాదవ్ 2000 పేజీల ఆర్డర్ కాపీ తీర్పును వెలువరించారు. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులే అని తీర్పు వెలువరించారు. కూల్చివేత పథకం ప్రకారం జరగలేదని తేల్చారు. కూల్చివేత పథకం ప్రకారం జరిగింది అనేందుకు ఆధారాలు లేవని జడ్జి తెలిపారు. కూల్చివేతకు ఎవరూ రెచ్చగొట్టే ప్రసంగాలు చెయ్యలేదనీ, కుట్రపూరితంగా వ్యవహరించలేదని తెలిపారు. దీంతో ఈ కూల్చివేత కేసును కొట్టివేశారు. ఇక ఈకేసులో నిందితులందరికీ ఊరట లభించింది. ఈ కేసులో 48 మంది నిందితుల్లో 16 మంది చనిపోగా ఆరోపణలు ఎదుర్కొన్న, బతికివున్న 32 మంది కోర్టుకు హాజరు కావాలని కోరగా… ఐదుగురు మాత్రమే కోర్టు రూం నెంబర్ 18లో ఉన్నారు. మిగతావారు బయట లాబీలో ఉన్నారు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జ్యోషితోపాటూ కరోనాతో బాధపడుతున్న ఉమాభారతి కోర్టుకు హాజరుకాలేదు. అద్వానీ, జ్యోషీ వర్చువల్ రూపంలో ఆన్‌లైన్‌లో హాజరయ్యేందుకు అనుమతి పొందారు.

కాగా 1992 డిసెంబర్ 6న కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చేశారు. దాదాపు 28 ఏళ్లు గడిచిపోయాయి. ఎప్పుడో రావాల్సిన తీర్పు. దర్యాప్తు, విచారణ పోటీ పడుతూ సాగడంతో 28 ఏళ్లు గిడిచిపోయాయి. 2017 ఏప్రిల్ 19న సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను రోజువారీ చేపట్టాలని ఆదేశించింది. ఈ కేసును విచారిస్తున్న జడ్జిని ట్రాన్స్‌ఫర్ చేయవద్దని ఆదేశించింది. ఇప్పటికి విచారణ పూర్తై… తీర్పు వెలువడింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/