వైరల్ : ‘ఓటమి అంటే అవమానం కాదు’.. ప్రకాష్ రాజ్ తో పవన్

‘మా’ ఎన్నికల సమరం ముగిసిపోయింది. రాజకీయ ఎన్నికలను తలపించేలా ఈసారి మా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు ల మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. ఈ పోరు లో మంచు విష్ణు ప్యానల్ ఘన విజయం సాధించింది. ఈ ఫలితాల అనంతరం ప్రకాష్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేసారు.

ప్రాంతీయ వాదానికి ప్రాధాన్యత ఇచ్చి ‘మా’ ఎన్నికల్లో తెలుగు బిడ్డను గెలిపించారని.. ఇలాంటి అసోసియేషన్ లో తాను కొనసాగలేనని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం బాధతో తీసుకున్నది కాదని.. అతిథిగా వచ్చాచను కాబట్టే అతిథిగానే ఉంటానని అన్నారు. సినిమాల ద్వారా ఇక్కడి ప్రేక్షకులు దర్శకనిర్మాతలతో కలిసుంటానని తెలిపారు. ఇక ప్రకాష్ రాజ్ తీసుకున్న నిర్ణయం ఫై సోషల్ మీడియా లో అంత మాట్లాడుకుంటున్నారు. కొందరు వకీల్ సాబ్ మూవీ లో ప్రకాష్ రాజ్ – పవన్ కళ్యాణ్ ల మధ్య సాగిన ఓ సన్నివేశాన్ని షేర్ చేస్తున్నారు.

‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ – ప్రకాశ్ రాజ్ లాయర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. చివరకు లాయర్ నందా కేసులో ఓడిపోయి పవన్ గెలుస్తారు. ఆ సందర్భంగా ఓటమి బాధలో ఉన్న ప్రకాశ్ రాజ్ కు పవన్ ధైర్యం అందిస్తారు. ”నందాజీ.. ఓటమి అంటే అవమానం కాదు. మనల్ని మనం గెలిచే అవకాశం. ఆల్ ది బెస్ట్” అని ప్రకాష్ రాజ్ తో పవన్ కల్యాణ్ చెబుతాడు. దానికి చిరునవ్వుతో ప్రకాశ్ రాజ్ ‘థ్యాంక్స్’ చెబుతారు. ఇప్పుడు ‘మా’ ఎన్నికల్లో విలక్షణ నటుడు ఓడిపోయి బాధ పడటంతో కొందరు సినీ అభిమానులు ఈ వీడియోను తెగ్ వైరల్ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ ను ట్యాగ్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.