ఢిల్లీలో కూర్చుని కాకమ్మ కబుర్లు చెబితే వాళ్లే రాళ్లతో కొడతారు

అతని ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా ర‌ఘురామా?: విజ‌య‌సాయిరెడ్డి

అమరావతి: వైస్సార్సీపీ అసంతృప్త ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఢిల్లీ నుంచి మీడియా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ వైస్సార్సీపీ పై తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పిస్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన వైస్సార్సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఓ నేత ప్రేమ కోసం ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నార‌ని ఆయ‌న అన్నారు.

‘ఎవరి మొప్పు కోసమో విప్పుకు తిరిగే స్థాయికి దిగజారావా రఘురామా! నలభై ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్కవాళ్ల‌కు ప్రేమ బాణాలు వేస్తుంటే అతని ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా? పనిచేసే వారికే పట్టం కడతారు ప్రజలు. ఢిల్లీలో కూర్చుని కాకమ్మ కబుర్లు చెబితే వాళ్లే రాళ్లతో కొడతారు’ అంటూ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/