వైఫ‌ల్యాన్ని క‌ప్పిపుచ్చునేందుకే నారాయ‌ణ అరెస్ట్‌ : చంద్ర‌బాబు

నోటీసుల్లేకుండా అరెస్ట్ అంటే క‌క్ష‌పూరితం కాదా అన్న చంద్ర‌బాబు

అమరావతి: మాజీ మంత్రి, నారాయ‌ణ విద్యా సంస్థ‌ల అధినేత పొంగూరు నారాయ‌ణ అరెస్ట్‌పై టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు స్పందించారు. నారాయ‌ణ అరెస్ట్ ముమ్మాటికీ క‌క్ష‌సాధింపేన‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించిన చంద్ర‌బాబు… ఆ వైఫ‌ల్యాన్ని క‌ప్పి పుచ్చుకునేందుకే నారాయ‌ణ‌ను అరెస్ట్ చేసింద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ముంద‌స్తు నోటీసు ఇవ్వ‌కుండా అరెస్ట్ చేయ‌డం అంటే క‌క్ష‌పూరిత చ‌ర్య కాదా? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/