ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పైనా దర్యాఫ్తు జరపొద్దట!

ఏమైంది 40 ఇయర్స్‌ ఇండస్ట్రీకి?

vijay sai reddy
vijay sai reddy

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. మద్యం ధరలు పెంచి మందుబాబుల పొట్ట కొడుతున్నారని రంకెలేస్తున్నారు. పీపీఏలను సమీక్షించి తక్కువ ధరకు కరెంట్‌ కొనుగోలు చేద్దామని ప్రభుత్వమనుకుంటే చంద్రబాబు అడ్డుపడాతాడని విమర్శించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పైనా దర్యాప్తు జరపొద్దట. తన మాజీ పీఎస్‌ అడ్డంగా దొరికితే కక్ష సాధింపు అంటాడు. ఏమైంది 40 ఇయర్స్‌ ఇండస్ట్రీకి? అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా మరో ట్వీట్‌లో మద్యం వ్యసనం నుంచి బయటపడుతున్న వారిని రెచ్చగొట్టి మళ్లీ బానిసలను చేసిందాకా చంద్రబాబు నిద్రపోయేట్టు లేడని దుయ్యబట్టారు. ఇప్పుడిప్పుడే తాగుడుకు దూరమై భార్యపిల్లలతో ప్రశాంతంగా గడుపుతున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇంత బాధ్యత లేకుండా మాట్లాడటం దేశంలో ఎక్కడా కనిపించదని విజయసాయిరెడ్డి విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/