అదుపు తప్పిన కారు..ముగ్గురు మృతి

car-fell-into-lake
car-fell-into-lake

భువనగిరి: యదాద్రి భువనగిరి జిల్లా సర్నెనిగూడెం లో కారు ఘోర కారు ప్రమాదం చోటుచేసుకుంది. రామన్నపేట మండలం వెల్లంకి చెరువులోకి ప్రమాదవశాత్తు ఓ కారు అదుపు తప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సర్నెనిగూడెం సర్పంచ్‌ భర్త మధు(37), కుమారుడు మణికంఠ(9), వార్డు మెంబర్‌ శ్రీధర్ రెడ్డి(25) మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సర్నేని గూడెం గ్రామ సర్పంచ్‌ స్వప్న భర్త, తొమ్మిదేళ్ల కుమారుడితో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా, కారు ఒక్కసారిగా అదుపు తప్పి చెరువులో బోల్తా కొట్టింది. ఈ క్రమంలో ఇంటి నుంచి వెళ్లినవారు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చివరకు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం వెల్లంకిలో సీసీ పుటేజ్‌ పరిశీలించిన పోలీసులు… కారు చెరువులో పడినట్లు గుర్తించారు. దీంతో కారుతో పాటు, గల్లంతు అయిన ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/