అలా చేస్తే పాక్‌-భారత్‌ చర్చలు ఫలిస్తాయి

పాక్‌ ఉగ్రవాదం విషయంలో ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి

india,pakistan and america
india,pakistan and america

అమెరికా: అగ్రరాజ్యం అమెరికా భారత్, పాక్‌ల మధ్య చర్చలు ఫలప్రదం కావాలంటే ఉగ్రవాదంపై సరైన చర్యలు తీసుకోవాలని తాజాగా శ్వేతసౌధం శుక్రవారం ఓ ప్రకటన చేసింది. తన భూభాగంలోని ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద మూకలపై పాకిస్థాన్ కచ్చితంగా చర్యలు తీసుకుంటేనే భారత్, పాక్‌ల మధ్య చర్చలు విజయవంతమవుతాయని అగ్రరాజ్యం మరోసారి స్పష్టం చేసింది. కాగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ట్రంప్ తన వంతు సహాకారం అందజేస్తారని, ఇరు దేశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలని శ్వేతసౌధం ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భారత పర్యటన సందర్భంగా కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వంపై ట్రంప్ మళ్లీ ప్రకటన చేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. పై విధంగా స్పందించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/