చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విమర్శలు
పెట్టుబడిదారీ ముఠా తయారుచేశాడంటూ విమర్శలు

అమరావతి: సిఎం జగన్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈవిషయంపై వైఎస్ఆర్సిపి విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహానేత వైఎస్ఆర్ లాగా, సిఎం జగన్ లాగా చంద్రబాబును గుర్తుకు తెచ్చే పథకం ఒక్కటీ లేదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందు నోటికొచ్చిన అబద్ధాలు చెబుతాడని, డబ్బు వెదజల్లి ప్రజాభిప్రాయాన్ని మార్చవచ్చనే భ్రాంతిలో మునిగితేలుతుంటాడని చంద్రబాబుపై విమర్శలు చేశారు. దీనికోసం ఒక నయా పెట్టుబడిదారీ ముఠాను తయారుచేశాడని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం ద్వారా 30 లక్షల 16 వేల మంది గర్భవతులు, పిల్లలు నాణ్యమైన పోషకాహారం పొందుతారని విజయసాయి వెల్లడించారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మార్పును చూస్తారని తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/