యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను పరామర్శించిన మోహన్ బాబు

ఇటీవలే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాతృమూర్తి కన్నుమూత


విజయవాడ: మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను సినీ నటుడు మోహన్ బాబు పరామర్శించారు. యార్లగడ్డ ఇటీవలే తన మాతృమూర్తిని కోల్పోయారు. ఈ రోజు పెదపారుపూడి మండలం వానపాముల గ్రామంలోని యార్లగడ్డ నివాసానికి మోహన్ బాబు చేరుకున్నారు. ఆయన తల్లి రంగనాయకమ్మ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులందరిని పరామర్శించారు.

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు మోహన్ బాబు అత్యంత సన్నిహితుడు. వీళ్లిద్దరిదీ దాదాపు ఐదు దశాబ్దాల అనుబంధం. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. యార్లగడ్డ తనకు అత్యంత ఆప్తుడని చెప్పారు. ఆయన తల్లిని కోల్పోవడం తనను కలచి వేసిందని అన్నారు. రంగనాయకమ్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/