జగన్ ఘనత చూసి గొంతు పెగలడం లేదు

ట్విట్టర్ లో ఎల్లో మీడియాపై విజయసాయి సెటైర్లు

అమరావతి: ఏపి సిఎం జగన్‌ భారత్‌లో అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో టాప్‌3లో నిలిచినా ఆ విషయాన్ని కొన్ని పత్రిఏపి సిఎం జగన్‌ భారత్‌లో అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో టాప్‌3లో నిలిచినా ఆ విషయాన్ని కొన్ని పత్రికలు ప్రచురించలేదని వైస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, ‘అప్పట్లో అడ్రసులేని సంస్థల నుంచి ఏవేవో అవార్డులొచ్చేవి బాబుకి. ఎల్లో మీడియా అహో… ఒహో అని ఎలివేషన్లు ఇచ్చేది. కొనుక్కున్న అవార్డులన్న సంగతి బయటికి రాకుండా ప్రచారం హోరు సాగేది. ఏబీపీ, సివోటర్ సర్వే జగన్ గారిని మూడో అత్యుత్తమ సిఎంగా గుర్తిస్తే పచ్చ మీడియా గొంతుపెగలడం లేదు’ అని ఆయన సెటైర్లు వేశారు.

https://twitter.com/VSReddy_MP/status/1351047149111418880


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/