అక్కడ్నించే పోటీ చేస్తా:దీదీ

నందిగ్రామ్ సభలో పాల్గొన్న మమత

నందీగ్రామ్‌: పశ్చిమ బెంగాల్‌లో ఈసారి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నందీగ్రామ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర సిఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఇవాళ ప్ర‌క‌ట‌న చేశారు. ఇటీవ‌ల తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సువేందు అధికారి బిజెపి పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ది నందీగ్రామ్ నియోజ‌క‌వ‌ర్గం. దీంతో ఇప్పుడు రాబోయే బెంగాల్ ఎన్నిక‌లు.. మ‌మ‌తా వ‌ర్సెస్ బిజెపిగా అవ‌త‌రించ‌నున్నాయి. నందీగ్రామ్ నుంచి పోటీ చేస్తాన‌ని, అది నాకు క‌లిసివ‌చ్చే స్థానం అని దీదీ ప్ర‌క‌టించారు. ఓ ప‌బ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్న ఆమె ఈ ప్ర‌క‌ట‌న చేశారు. కోల్‌క‌తాలోని బాబ‌నిపుర్‌తో పాటు నందీగ్రామ్ నియోక‌వ‌ర్గాల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు.

గ‌తంలో నందీగ్రామ్‌లో రైతు ఉద్య‌మం చేప‌ట్టిన మ‌మ‌తా బెన‌ర్జీ.. 2011లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను సొంతం చేసుకున్నారు. సెజ్ ఏర్పాటును వ్య‌తిరేకిస్తూ 2007లో ఆ ప‌ట్ట‌ణంలో భారీ ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగాయి. ఆ ఆందోళ‌న‌ల్లో 14 మంది మ‌ర‌ణించారు. అయితే ఆ త‌ర్వాత జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో.. తృణ‌మూల్ పార్టీ జ‌య‌కేతనం ఎగుర‌వేసింది. అనూహ్య రీతిలో లెఫ్ట్ ప్ర‌భుత్వానికి దీదీ జ‌ల‌క్ ఇచ్చారు. గ‌తంలో క‌లిసి వ‌చ్చిన నందీగ్రామ్ నుంచి తాను పోటీ చేయ‌నున్న‌ట్లు మ‌మ‌తా ప్ర‌క‌టించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/