డైరెక్ట్‌గా వ‌స్తే త‌ట్టుకోగ‌ల‌వా? అంటూ లోకేష్ ను ప్రశ్నించిన విజయసాయిరెడ్డి

టెన్త్ లో ఫెయిల్ అయినా విద్యార్థులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జూమ్ వీడియో కాల్ లో మాట్లాడి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుండగా..సడెన్ గా జూమ్ వీడియో లో వైస్సార్సీపీ మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ తో పాటు మరొక నేత దేవేందర్ రెడ్డి వచ్చి షాక్ ఇచ్చారు. వైసీపీ నేతలు ఒక్కసారిగా కనిపించడం తో నిర్వాహకులు వారి కాల్ ను కట్ చేసారు. ఈ క్ర‌మంలో విద్యార్థుల ఐడీల‌తో త‌న జూమ్ మీటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేల‌పై విరుచుకుప‌డిన లోకేష్… ద‌మ్ముంటే నేరుగా త‌న‌తో చ‌ర్చ‌కు రావాలంటూ స‌వాల్ చేసారు. మరోపక్క వైసీపీ నేతల రాకపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడం..అసలు ఎందుకో వచ్చారో నాని , వంశీ క్లారిటీ ఇవ్వడం వంటివి జరిగిపోయాయి.

తాజాగా ఈ ఘటన ఫై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. జూమ్ మీటింగ్‌లోకి వ‌స్తేనే మ్యూట్ చేసి పారిపోయావ్‌.. ఇక డైరెక్ట్‌గా వ‌స్తే త‌ట్టుకోగ‌ల‌వా లోకేశం? అంటూ ఆయ‌న లోకేశ్‌ను ప్ర‌శ్నించారు. ‘చిన్న పిల్లలతో రాజకీయం చెయ్యడం కాదు. పోయి పప్పు తిని పడుకో చిట్టయ్యా..’ వ్యంగ్యంగా ట్వీట్ చేసాడు.

అంతకు ముందు టీడీపీ నేతలు ఏమని విమర్శించారంటే.. “8 క్లాస్ ఫెయిల్ అయిన సన్న బియ్యం సన్నాసి 10 క్లాస్ జూమ్ కి రావడం విడ్డూరం. గడప గడప కి వెళ్తుంటే ప్రజలు చెప్పుతో కొడుతున్నారు అందుకే ఆ కార్యక్రమం వదిలేసి జూమ్ కి వచ్చారు. విద్యా వ్యవస్థ ను నాశనం చేసిన జగన్ రెడ్డి రోడ్ల మీదకి వెళ్తే జనం పరిగెత్తించి కొడతారు అనే భయంతోనే పరదాలు కట్టుకొని వెళ్తున్నాడు”. అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు. కొడాలి నాని కూర్చోవాల్సింది జూమ్ మీటింగ్ లో కాదని, పదో తరగతి పరీక్షల్లో అని అన్నారు. వేలిముద్రగాళ్లు రాజకీయాల్లో ఉంటే ఇలాగే జరుగుతుందని ఎద్దేవా చేశారు. సీఎంతో పాటు ఆయన సహచరులందరికీ చదువంటే చాలా చులకన భావం ఉందని చెప్పారు. తమ నేత లోకేశ్ విద్యార్థుల కోసం యజ్ఞం చేస్తుంటే… వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని అన్నారు. ఏపీలో చదువులు ఎటు పోతున్నాయో అర్థంకాని పరిస్థితి ఉందని మాజీ మంత్రి జవహర్ అన్నారు.