ప్రభాస్ పెళ్లి కబురు రాబోతోందా..?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరున్న ప్రభాస్..తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీని షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ పెళ్లి కోసం గత కొన్నేళ్లుగా అభిమానులు, టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. చిన్న చిన్న హీరోలు పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటే..44 ఏళ్లు ఉన్న ప్రభాస్ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అంత మాట్లాడుకుంటున్నారు.

ఈ తరుణంలో ప్రభాస్ పెట్టిన పోస్ట్ అందరిలో ఆత్రుత పెంచుతుంది. ‘డార్లింగ్స్. ఫైనల్‌గా మన జీవితంలోకి ఒక స్పెషల్ వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు ప్రభాస్. ఇది చూసి ప్రభాస్ పెళ్లి గురించి అప్డేట్ ఇవ్వబోతున్నాడని చాలామంది ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కృష్టంరాజు భార్య శ్యామల దేవి కూడా ఈ ఏడాది ఎలాగైనా ప్రభాస్‌కు పెళ్లి చేస్తామని ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే ఈ అప్డేట్ పెళ్లి గురించే అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. మరి ప్రభాస్ ఎలాంటి అప్డేట్ ఇస్తాడో చూడాలి.