పూజా హెగ్డేకు ఘోర పరాభవం ..

వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకెళ్తున్న పూజా హగ్దే కు ఘోర పరాభవం ఎదురైంది. ఇండిగో స్టాఫ్ సిబ్బంది ఒకరు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పూజా చెప్పుకొచ్చింది. ‘నేను ముంబైలో ఇండిగో-6ఈ విమానం ఎక్కాను. విమాన సిబ్బంది విపుల్ నకాషే ఎలాంటి కారణం లేకుండా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అహంకారంతో బెదిరింపులకు దిగాడు, మాపై గట్టి గట్టిగా అరిచాడు. నిజంగా అతడి మాటలు విని నాకు ఎంతో భయం వేసింది.

సాధారణంగా ఇలాంటి విషయాలను నేను ఎక్కువగా పట్టించుకోను. కానీ ఈ వ్యక్తి ప్రవర్తన చూసి భయమేసింది. అందుకే ట్వీట్ చేస్తున్నాను.’ అని ఆమె పేర్కొంది. దీనికి ఇండిగో సంస్థ స్పందించింది, మీ చేదు అనుభవానికి క్షమించండి. మేము వెంటనే మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాము, దయచేసి మీ PNRని కాంటాక్ట్ నంబర్‌తో పాటు మాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి అని పేర్కొన్నారు.

ఇక పూజా సినిమాల విషయానికి వస్తే..కెరియర్ మొదట్లో వరుస ప్లాపులతో ఇబ్బంది పడిన పూజా హెగ్డే ..డీజే , అరవింద సమేత.. వీరరాఘవ తో సక్సెస్‌ బాట పట్టింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ తాజాగా ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ , ‘బీస్ట్ ‘ సినిమాలతో వరుస డిజాస్టర్లను అందుకుంది. అయితే ఈ డిజాస్టర్లు అమ్మడి కెరియర్ కు ఇబ్బంది ఏమిలేదు. వరుస సినిమాలు లైన్లో ఉండడం తో అమ్మడు బిజీ గా ఉంది. మరి రాబోయే చిత్రాలు ఫలితాలు బట్టి అమ్మడి సినీ కెరియర్ ఉంటుంది.