‘అగ్నిపథ్​’ నిరసనల వల్ల మరో ప్రాణం గాల్లో కలిసింది

అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో అర్ధాంతరంగా రైలును నిలిపివేయటంతో ఓ ప్రాణం గాల్లో కలిసింది. ‘అగ్నిపథ్’​ పధకాన్ని వ్యతిరేకిస్తూ గత నాల్గు రోజులుగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. వివిధ రాష్ట్రాల్లో అనేక రాళ్లను తగలబెట్టడం , పలు రైల్వే స్టేషన్లను ధ్వసం చేయడం తో పలు రూట్లలో అధికారులు రైళ్లను నిలిపివేశారు. కొన్ని రైళ్లను రద్దు కూడా చేశారు. ఇక ఈ ఆందోళనలు తెలుగు రాష్ట్రాలను కూడా తాకాయి. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎలాంటి విధ్వసం జరిగిందో చూసాం. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు సైతం మృతి చెందాడు. ఈరోజు కూడా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా పలు రైళ్లను ఎక్కడెక్కడి నిలిపివేశారు.

అర్ధాంతరంగా రైలును నిలిపివేయటంతో ఓ ప్రాణం పోయింది. అత్యవసర చికిత్స కోసం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ గుండె జబ్బు బాధితుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా కొత్తవలసలో చోటు చేసుకుంది. అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో కోర్బా నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఎక్స్​ప్రెస్ రైలును రైల్వే అధికారులు విజయనగరం జిల్లా కొత్తవలసలో నిలిపివేశారు. అర్ధాంతరంగా రైలును నిలిపివేయటంతో ప్రయాణికులు విశాఖపట్నం చేరుకోడానికి బస్సులు, ఆటోలు ఆశ్రయించారు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లా నహుపాడకు చెందిన గుండెజబ్బు ఉన్న వ్యక్తి జోగేష్ బెహరా(75) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అత్యవసరంగా విశాఖకు తరలించేందుకు స్థానికంగా ప్రైవేటు అంబులెన్సులు అందుబాటులో లేకపోవటంతో బాధితుడి కుటుంబ సభ్యులు కొత్తవలసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేస్తుండగానే జోగేష్ బెహరా మృతి చెందాడు.

ఈ ఘటన తో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఘాజీపుర్​లోని జమానియా రైల్వేస్టేషన్​లో నిలిచిన దానాపూర్-ఆనంద్ విహార్ రైలు నిలిచిపోవటం వల్ల ఓ మహిళ అందులోనే ప్రసవించిది. పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. తల్లీబిడ్డలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. మొత్తం మీద అగ్నిపథ్ వల్ల తీవ్ర నష్టాలు చోటుచేసుకుంటున్నాయి.