ఫ్యామిలీ స్టార్ గా వస్తున్న విజయ్ దేవరకొండ

వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ..ప్రస్తుతం గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ పెట్టారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ బుధవారం (అక్టోబర్ 18) రిలీజ్ చేయగా.. విజయ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన మృనాల్ ఠాకూర్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది.

“లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడం.. పొద్దున్నే లేచి పిల్లలను రెడీ చేయడం అనుకున్నావా సెటిల్మెంట్ చేయడమంటే” అంటూ విలన్ అంటాడు. ఆ వెంటనే విజయ్ మార్క్ డైలాగ్, యాక్షన్ సీన్ ఉంటుంది. ఉల్లిపాయలు తెస్తే మనిషి కాదా.. పిల్లలను రెడీ చేస్తే మగాడు కాదా.. ఐరన్ నే వంచాలా అంటూ పక్కనే ఉన్న స్టీల్ రాడ్ ను వంచేస్తాడు.

ఓ విలన్ తల పగలగొట్టి.. సారీ బాబాయ్ కంగారులో కొబ్బరికాయ తేవడం మరచిపోయాను.. తలకాయ కొట్టేశానని అంటాడు. ఆ వెంటనే ఫ్యామిలీ స్టార్ టైటిల్ స్క్రీన్ పై పడుతుంది. చివర్లో ఎంట్రీ ఇచ్చే మృనాల్.. ఏవండీ అంటూ విజయ్ ను పిలిచే సీన్ తో గ్లింప్స్ ఎండ్ చేసారు. ఈ గ్లింప్స్ ప్రేక్షకులను , అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గీత గోవిందం తర్వాత విజయ్ – పరుశురాం కలయిక లో వస్తున్న సినిమా కావడం తో అందరిలో అంచనాలు నెలకొని ఉన్నాయ్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా , సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

YouTube video