గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలి : ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. గౌతమ్ రెడ్డి కుటుంబంతో ఎన్నో ఏళ్ల సాన్నిహిత్యం ఉందన్నారు. తనపై ఎంతో అభిమానం చూపేవారన్నారు. పనిపట్ల నిబద్దత కలిగిన నాయకుడు గౌతమ్ రెడ్డి అన్నారు. చిన్న వయసులోనే మృతిచెందడం బాధకరమన్నారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/