అపోలో ఆసుప‌త్రికి చేరుకున్న వైఎస్ షర్మిల

కాసేప‌ట్లో అపోలో ఆసుప‌త్రికి చేరనున్న జ‌గ‌న్‌, చంద్ర‌బాబు

హైదరాబాద్ : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో హఠాన్మరణం చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి వార్త తెలుసుకున్న ప్ర‌ముఖులు అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లి వ‌స్తున్నారు. ఇప్ప‌టికే అపోలో ఆసుప‌త్రికి చేరుకున్న వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల ఆయ‌న పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. అలాగే, ఆసుప‌త్రి వ‌ద్ద‌కు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి చేరుకున్నారు.

మ‌రోవైపు, త‌న కార్యక్ర‌మాల‌న్నింటినీ వాయిదా వేసుకున్న ఏపీ సీఎం జ‌గ‌న్ తాడేప‌ల్లి నుంచి హైద‌రాబాద్ బ‌య‌లుదేరారు. కాసేప‌ట్లో హైద‌రాబాద్ చేరుకుని అపోలో ఆసుప‌త్రికి వెళ్లి మేక‌పాటి గౌతం రెడ్డి పార్ధివ దేహాన్ని సంద‌ర్శిస్తారు. అలాగే, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కూడా కాసేప‌ట్లో అపోలో ఆసుప‌త్రికి వెళ్ల‌నున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/