దళితబంధును స్వాగతిస్తాం: వీహెచ్

బీసీలకు బీసీబంధు ఇవ్వాలి.. వీహెచ్

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. అయితే, రాష్ట్రంలో బీసీలు కూడా చాలా వెనుకబడి ఉన్నారని… వారికి కూడా బీసీబంధును ఇవ్వాలని కోరారు. కేవలం హుజూరాబాద్ లో మాత్రమే కాకుండా రాష్ట్రమంతా దళితబంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ పంజాగుట్ట వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తాను మూడేళ్ల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వీహెచ్ మండిపడ్డారు. వెంటనే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 6వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/