రేవంత్ రెడ్డి ఫై వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

వివాదాలకు కేరాఫ్ గా నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ..ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తాడో..ఎప్పుడు ఎవరిపై కామెంట్స్ చేస్తాడో..విమర్శలు చేస్తారో ఎవరికీ తెలియదు. అప్పటివరకు పొగడ్తలతో నింపేసి..ఆ క్షణమే విమర్శలు చేయడం చేస్తుంటారు. అలాంటి రామ్ గోపాల్ వర్మ ..టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసి వార్తల్లో నిలిచారు.

తాజాగా రామ్ గోపాల్ వర్మ…టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘‘విత్ రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ’’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. రీసెంట్ గా వర్మ తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ తీస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ ను కలవడం చర్చనీయాంశమవుతున్నది. మరి రేవంత్ ను వర్మ ఎందుకు కలిసినట్లు..అనేదానిపై అంత మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం వర్మ తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్ కొండా మురళి పై బయోపిక్ ‘కొండా’ తీస్తున్న సంగతి తెలిసిందే.