ప్రజలు బాగుపడాలా ? ఈటల రాజేందర్‌ బాగుపడాలా? ఓటర్లరా మీరే గ్రహించండి – హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుజురాబాద్ ఉప ఎన్నికల హడావిడి నడుస్తుంది. హుజురాబాద్ నియోజకవర్గంలో బిజెపి vs తెరాస వార్ నడుస్తుంటే..రాష్ట్రంలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల గెలుస్తారా..? తెరాస పార్టీనా అని అంత మాట్లాడుకుంటున్నారు. నియోజకవర్గంలో తెరాస నేతలు కానీ ఈటెల రాజేందర్ కానీ ఎక్కడ తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. గురువారం మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో పర్యటించారు.

ఈ సందర్భాంగా ఆయన ఓటర్లను ఒకటే అడిగారు. ప్రజలు బాగుపడాలా ? ఈటల రాజేందర్‌ బాగుపడాలా? ఆలోచించాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వంలో అచ్చేదిన్‌ కాదు సచ్చేదిన్‌ వచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపీ అమ్మకానికి రూపమైతే టీఆర్‌ఎస్‌ నమ్మకానికి రూపమని హరీష్ అన్నారు. రైళ్లు, రోడ్లు అమ్మితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని నిలదీశారు. మీ సహకారంతో గెల్లు శ్రీనును.. గెలుపు శ్రీనుగా సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దాం. వీణవంకలో 2-3 రోజుల్లో 24/7 పనిచేసేలా ఆస్పత్రి, పోస్ట్ మార్టం కేంద్రం మంజూరుకు కృషి చేస్తా అని హామీ ఇచ్చారు.