భారత్ కు మరో స్వర్ణం
బ్యాడ్మింటన్ సింగిల్స్ లో ప్రమోద్ కు పసిడి
Pramod Bhagat wins gold in badminton singles SL3 at Tokyo Paralympics
టోక్యో : జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్ క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. ఇవాళ షూటింగ్ లో స్వర్ణం, రజతం చేజిక్కించుకున్న భారత్, తాజాగా బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లోనూ స్వర్ణం గెలుచుకుంది. ఎస్ఎల్-3 (సింగిల్ లెగ్) ఫైనల్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రమోద్ భగత్ అద్భుత ప్రదర్శన కనబరిచి పసిడి పతకం సాధించాడు. స్వర్ణం కోసం జరిగిన పోరులో ప్రమోద్ భగత్ 21-14, 21-17తో బ్రిటన్ కు చెందిన డేనియల్ బెతెల్ పై ఘనవిజయం నమోదు చేశాడు.
ప్రమోద్ భగత్ ప్రపంచ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో వరల్డ్ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. ఇవాళ జరిగిన ఫైనల్లో తన టాప్ ర్యాంకుకు తగిన ఆటతీరు ప్రదర్శించి భారత శిబిరంలో బంగారు కాంతులు నింపాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/