కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ అభిమాని ఫై దాడి

Pawan Kalyan's look in Bheemlanayak
Pawan Kalyan’s look in Bheemlanayak

కృష్ణా జిల్లా నందిగామ అనాసాగరంలో పవన కళ్యాణ్‌ అభిమాని పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ నెల 2 వ తేదీన పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా సాయంత్రం అనాసాగరంలో పుట్టిన రోజు వేడుకలు అభిమానులు నిర్వహించారు. తర్వాత బల్లపైన నిద్రిస్తున్న గోపి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న అతడిని పోలీసులు దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు .

తన పై ఐదుగురు వ్యక్తులు దాడి చేశారని గోపి చెబుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెప్టెంబర్‌ రెండో తేదీన పవన్‌ కళ్యాణ్‌ జన్మదినాన్ని పురష్కరించుకుని దాడి జరిగిన ఘటనల్లో ఇది రెండోది నిన్న గుంటూరు శివారు ప్రాంతంలో ఇద్దరు కథనాయకుల అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఫ్లెక్సీ ఏర్పాటు చేసే విషయంలో జరిగిన వివాదం పోలీసులు వరకు రాకుండా మధ్య వర్తులు రాజీ కుదిర్చినట్లు తెలుస్తోంది.