క్షీణించిన డీఎస్ ఆరోగ్యం..

నిజామాబాద్ మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదారాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసారు. ప్రస్తుతం ఆయనకు ఐ.సి.యూలో చికిత్స అందిస్తున్నారు. ఆయనను మూత్ర సంబంధిత సమస్య వల్ల ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆయన తనయుడు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడించారు.

తన తండ్రి కోసం ప్రార్థించాలని సోషల్ మీడియా వేదికగా డి ఎస్ అభిమానులను, అనుచరులను కోరారు. ఇటీవల కొంతకాలంగా శ్రీనివాస్ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన డీ శ్రీనివాస్.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే.. కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. ఇక రాజకీయాల్లో కూడా ప్రస్తుతం ఆయన క్రియాశీలంగా లేరనే చెప్పాలి.