సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా?

Will remain in NDA fold forever now.. Bihar CM Nitish Kumar

బిహార్ సీఎం నితీశ్ కుమార్ తన పదవికి మరోసారి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మోడీ మంత్రి వర్గంలో చేరేందుకు ఆయన తన పదవిని వదులుకుంటారని చర్చ నడుస్తోంది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో విజయంపై బీజేపీ ధీమాగా ఉంది. ఈ క్రమంలో నితీశ్ కు మోదీ 3.0 కేబినెట్లో చోటు కల్పించి బిహార్లో బీజేపీ అభ్యర్థిని సీఎం చేయనున్నట్లు సమాచారం.

ఇదే విషయమై ఈరోజు ఢిల్లీలో బిజెపి పెద్దలతో నితీశ్ చర్చించినట్లు తెలుస్తోంది. ఇక జనవరి నెలలో బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 9వ సారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర నేతలు హాజరయ్యారు.