హైదరాబాద్‌ జంట పేలుళ్ల ఘటన.. నలుగురు ఉగ్రవాదులకు పదేండ్ల జైలుశిక్ష

Delhi Court Sentences 4 Indian Mujahideen Operatives 10 Years Imprisonment For Terrorist Attacks In 2012

న్యూఢిల్లీః హైదరాబాద్‌ జంట పేలుళ్లతో సహా దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో ఇండియన్‌ ముజాహిద్దీన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులకు ఎన్‌ఐఏ కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. హైదరాబాద్‌, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ఒబేద్‌, రెహ్మాన్‌, ఇమ్రాన్‌ ఖాన్‌, ధనీష్‌ అన్సారీ, ఆప్తాబ్‌ ఆలం అనే నలుగురు ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారని ఎన్‌ఐఏ చేసిన వాదనలతో ప్రత్యే కోర్టు ఏకీభవించింది. 2007లో హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్‌, లుంబినీ పార్కులో జరిగిన పేలుళ్లు.. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లతోనూ వీరికి సంబంధాలు ఉన్నాయని నిర్ధారించింది. ఇవేకాకుండా వారణాసి, ముంబయి, ఫజియాబాద్‌, ఢిల్లీ పేలుళ్లలోనూ వీరి పాత్ర ఉందని గుర్తించింది. జూలై 7వ తేదీన ఈ నలుగురు నిందితులను దోషులుగా తీర్చిన ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు.. గురువారం నాడు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.