ఆండ్రాయిడ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాల్సిందే!

లేకుంటే హ్యాకింగ్‌కు లోనయ్యే ప్రమాదం

వందకోట్ల ఆండ్రాయిడ్‌ ఫోన్లు ప్రమాదానికి గురికానున్నాయట. ఈ మేరకు నిపుణులు వెల్లడిస్తున్నారు.. వీటిని సాధ్యమైనంత త్వరగా అప్‌డేట్‌ చేసుకోవాలని పేర్కొన్నారు.

లేకుంటే ఇవి హ్యాకింగ్‌కు లోనయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

వివరాలిలా ఉన్నాయి..బైవిచ్‌ అనే సంస్థ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ప్రతి 5 ఆండ్రాయిడ్‌ ఫోన్లలో రెండు గూగుల్‌ నుంచి సెక్యూరిటీ ఆప్‌డేట్స్‌ అవ్వలేకపోతున్నాయని, గూగుల్‌ సపోర్ట్‌ చేయకపోవటమే ప్రధాన కారణంగా తెలిసింది..

ఇలా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఫోన్లకు అప్‌డేట్స్‌ రావటంలేదని, కొత్త ఫోన్‌కు మారిపోవటమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/