బాగ్దాద్‌లో రాకెట్ల దాడి..ఐదుగురు మృతి

బాగ్దాద్: సోమవారం మధ్యాహ్నం బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద రాకెట్ దాడులు జరిగాయి. దాడుల్లో అల్బుఅమీర్ ప్రాంతంలో రెండిండ్లు కుప్పకూలడంతో ముగ్గురు చిన్నారులతో సహా ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. అల్‌జిహాద్ పొరుగు ప్రాంతాల నుంచి క్రిమినల్ గ్యాంగులు వీటిని ప్రయోగించినట్లు ఇరాకి సంయుక్త ఆపరేషన్ కమాండెంట్ తెలిపారు. ఇరాక్ ప్రధాని, ఆ దేశ భద్రతా దళాల కమాండెంట్ చీఫ్ ముస్తఫా అల్ ఖాధీమి దాడులను తీవ్రంగా ఖండించారు. ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టి దుండగులను అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. దాడులకు ఇంతకువరకు ఏ స్థానిక సంస్థ బాధ్యత వహించలేదు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/